📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

HYD-Metro : హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నెటిజన్ల ఫైర్

Author Icon By Sudheer
Updated: May 15, 2025 • 8:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ మెట్రో (HYD Metro ) రైల్ సేవలపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్లలోని వాష్‌రూమ్‌ల(Washrooms) పరిస్థితి దారుణంగా ఉందని పలువురు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. వాష్‌రూమ్‌లను వినియోగించేందుకు ఛార్జ్ వసూలు(Charge collection) చేస్తున్నప్పటికీ, శుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్టేషన్లలో దుర్వాసన భరించలేనంతగా ఉందని, అది ఆరోగ్యానికి హానికరంగా కూడా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

వాష్‌రూమ్‌ల పరిస్థితి దారుణం

సాధారణ ప్రయాణికులే కాకుండా రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వాష్‌రూమ్‌లు తలుపులు సరిగ్గా ఉండకపోవడం, నీటి సరఫరా లేకపోవడం, నిత్యం శుభ్రం చేయకపోవడం వంటి సమస్యలు ఉట్టిపడుతున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. “ఒక్కసారి వాడినవాళ్లెవ్వరూ మళ్లీ అటువైపు చూసే పరిస్థితి లేదు” అంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.

చార్జీలు పెంచడం పై ఆగ్రహం

ఇలాంటి దుస్థితుల్లోనూ ఛార్జీలు పెంచడమేంటని, ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా లాభాలపైనే దృష్టి పెట్టారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో సేవలు అభివృద్ధి చెందాలంటే ప్రయాణికుల అనుభవం ప్రధానమని, వీలైనంత త్వరగా నిర్వహణా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాణ్యమైన సేవలకే ప్రజలు ఛార్జ్‌లు చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారని, మౌలిక సదుపాయాల నిర్వహణకు మెట్రో అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : Jayam Ravi : భార్య ఆరోపణలపై జయం రవి సుదీర్ఘ లేఖ విడుదల

Google News in Telugu hyderabad metro Metro Washroom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.