📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్ పై పోలీసుల కొరడా

Author Icon By Saritha
Updated: October 23, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రంకన్ డ్రైవ్ తరహాలో నిందితులను కోర్టులో హాజరు పరచాలని నిర్ణయం

హైదరాబాద్ : జంట నగరాలలో ఇకముందు సెల్ఫోన్ డ్రైవింగ్పై(HYD) కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిమానాలతో సరిపుచ్చు తుండగా ఇక ముందు ఈ తరహా నేరాలకు పాల్పడే వారిని మద్యం(Alcohol) తాగి వాహనాలను నడిపే వారిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు జరిమానాలతో వదలకుండా నేరుగా కోర్టులో హాజరు పరచాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు నిర్ణయించారు. సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగు తున్న ప్రమాదాల నివారణకు ఈ చర్యలు తీసు కుంటున్నట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు చెబు తున్నారు. వారంరోజులుగా సెల్ఫోన్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ చేబట్టిన ట్రాఫిక్ పోలీసులు ఇందులో భాగంగా నాలుగు వేల వరకు కేసులు నమోదు చేశారు. జంట నగరాలలో ఏటా జరుగు తున్న రోడ్డు ప్రమాదాలలో సెల్ఫోన్ డ్రైవింగ్ కారణంగా ఘటనలు పదుల సంఖ్యలో వుండడం తెలిసిందే. దీనివల్ల అనేకసార్లు సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ప్రమా దాల్లో పడుతున్నారు. ఇందులో కొందరు మరణి స్తుండగా మరికొందరు తీవ్రంగా లేదా స్వల్పంగా గాయపడుతున్నారు. ఇంకొన్నిసార్లు వీరి కారణం గా ఇతరులు ప్రమాదాలలో పడి మరణించడం లేదా గాయపడడం జరుగుతోంది.

Read also: ఇందిరమ్మ ఇళ్ల 44.4 చదరపు గజాల స్థలాలకూ జీ+1 ఇంటికి అనుమతి

HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్ పై పోలీసుల కొరడా

రవాణాచట్టాల ప్రకారం సెల్ఫోన్ డ్రైవింగ్ తీవ్రమైన నేరం. సెల్ఫోన్ డ్రైవింగ్(HYD) మాత్రమే కాదు, సెల్ఫోన్లో సిని మాలు, లేడా వార్తలు చూస్తూ, చాటింగ్ చేస్తూ, పాటలు వింటూ వాహనాలు నడిపే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో భాగా పెరిగింది. వీటివల్ల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమా దాలు పెరుగుతున్నట్లు రవాణా శాఖ పేర్కొంది. ఈ విషయంలో కఠిన చట్టాలు వున్నా ఇంతకాలం పెద్దగా అమలుకు నోచుకోలేదు. అయితే ఈ చట్టాలను జంటనగరాలలో తొలిసారిగా కఠినంగా అమలు చేయనున్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్ కేసుల్లో పట్టుబడ్డ వారిని ఇక ముందు డ్రంకన్ డ్రైవింగ్ కేసుల తరహాలో కోర్టులో హాజరు పరచనున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో నిందితుల్లో కొందరికి జైలుశిక్ష పడుతున్న ఉదంతాలు, డ్రైవింగ్ లైసెన్స్లు రద్దవుతున్న ఘటనలు అనేకం వుండడం తెలిసిందే. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో అనేక మంది నిందితులకు నెలనుంచి మూడునెలల జైలు శిక్షపడిన ఉదంతాలున్నాయి. ఇలా జైలు శిక్షలకు గురై జైలు జీవితం గడిపిన వారి డ్రైవింగ్ లైసెన్స్ లను పదేళ్లనుంచిశాశ్వతంగా రద్దు చేయబడ్డాయి. మూడు అంతకు ఎక్కువగా డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలుకూడా కోర్టులు విధించడం గమనార్హం. ఇప్పుడు సెల్ఫోన్ డ్రైవింగ్ కేసుల్లో నింది తులకు ఈ తరహాశిక్షలు అమలు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. మొదట హైదరాబాద్లో అమలుచేశాక సైబరాబాద్, రాచకొండలో అమలు చేయాలని భావిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Cell Phone Driving Drunken Drive Hyderabad Traffic Police hyderbad news Latest News in Telugu road accidents telangana police Telugu News traffic rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.