paramilitary : పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు

Read Time:  1 min
Holidays for paramilitary forces cancelled
Holidays for paramilitary forces cancelled
FONT SIZE
GET APP

paramilitary : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. జమ్మూకశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు శ్రీనగర్ విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇక త్రివిధ బలాలలను ఎక్కడికక్కడ యాక్టివేట్ చర్యలను అధికారులు ప్రారంభించారు. అన్ని వైమానిక స్థావరాలలోనూ యుద్ద విమానాలు కథన రంగంలోకి దిగడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక నావికాదళం సముద్రతీర ప్రాంతాలలో భారీ ఎత్తున యుద్ధ నౌకలను మోహరించింది. సరిహద్దులకు వేలాదిమంది సైన్యాన్ని తరలిస్తున్నారు.

పారా మిలిటరీ బలగాలకు సెలవులు

ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట

ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట మొదలుపెట్టాయి. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించడానికి భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ కశ్మీర్‌కు చేరుకున్నారు. శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌లో ఆయన పర్యటించనున్నారు. కశ్మీర్‌ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి విదేశాంగ శాఖ, జల్ శక్తి ఉన్నతాధికారులు హాజరవుతారని సమాచారం. సింధూ జలాల ఒడంబడిక నిలిపివేత, సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ, పహల్గాం దాడి , పాక్‌ దౌత్యవేత్తలకు సమన్లు వంటి భారత ప్రభుత్వ చర్యల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం నేడు శ్రీనగర్‌లో పర్యటించి.. ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను కలవనున్నారు.

Read Also: పాక్‌ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.