బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం పలు అత్యవసర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తీరప్రాంత మరియు పరిసర జిల్లాల్లో రేపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. విజయనగరం, పరవతిపురం-మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.
Breaking News – ‘Tejashwi Praman Patra’ : ఫ్రీ కరెంట్, ఇంటికొక ఉద్యోగం.. తేజస్వీ హామీలు
ముఖ్యంగా కాకినాడ జిల్లాలో తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశంతో ఈ నెల 31 వరకు సెలవులు పొడిగించారు. తీరప్రాంతాల్లో గాలులు గంటకు 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో, విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తీర గ్రామాల్లో స్కూళ్ల భవనాలు, రహదారులు మరియు రవాణా సదుపాయాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. స్థానిక నిర్వాహక యంత్రాంగం విద్యుత్ సరఫరా మరియు త్రాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

మరోవైపు నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు కూడా రేపు హాలిడే ప్రకటించారు. తీవ్ర వర్షాల ప్రభావంతో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచగా, NDRF, SDRF సిబ్బంది తీరప్రాంతాల్లో మోహరించారు. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటే వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లరాదని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/