📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనపై హైకోర్టు తీర్పు

Author Icon By Sukanya
Updated: January 30, 2025 • 9:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాలని సామాజిక కార్యకర్త జెట్టి ఉమేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్ పాల్, జస్టిస్‌ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పబ్లిక్ గార్డెన్‌లో విగ్రహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ ఉమేశ్వర్‌రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విగ్రహాన్ని తొలగించి, గార్డెన్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని ఆయన కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఈ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సూచించారు. గార్డెన్‌లో 13 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురవ్వగా, విగ్రహాలు పెడితే స్థలాభావం తలెత్తుతుందని తెలిపారు. పార్క్‌లో పిల్లల ఆటస్థలం తగ్గిపోతుందని, రాజకీయ సమావేశాలకు విగ్రహాలను వాడుకుంటారని, భవిష్యత్తులో ఇతర పార్టీల నేతల విగ్రహాల కోసం డిమాండ్లు రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది శాంతిభద్రతలకు ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ వాదన ప్రకారం, పిటిషనర్‌కు ఈ వ్యవహారంపై చట్టపరమైన హక్కు లేదని, విగ్రహం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించదని తెలిపారు. సుప్రీంకోర్టు గత తీర్పులను ఉదహరిస్తూ, విగ్రహాల స్థాపనపై అభ్యంతరాలు ప్రధానంగా కుల, మత పరమైన సందర్భాల్లో మాత్రమే చెల్లుతాయని వాదించారు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

Atal Bihari Vajpayee Statue Google news Secunderabad Public Garden Telangana High Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.