రాయలసీమ ప్రాంతం మళ్లీ భారీ వర్షాల ప్రభావానికి లోనవుతోంది. ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి, పలు వాణిజ్య సంస్థలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం తీవ్రతతో పులివెందుల పట్టణం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.
Police Jobs : త్వరలో ఏపీలో 11,000+ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?
ఇక అన్నమయ్య జిల్లాలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న రాత్రి నుండి కురుస్తున్న వానలతో చిన్న వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రైతులు ఈ వర్షాలతో కొంత ఊరట పొందినప్పటికీ, తక్కువ ఎత్తున్న పంట పొలాలు నీటమునిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పలు గ్రామాల రహదారులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. రహదారి మధ్యలో గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవల విభాగాలు హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు బయటకు వెళ్లడాన్ని మానుకోవాలని సూచిస్తున్నాయి.

వాతావరణ శాఖ ప్రకారం, ఈ వర్షాలు ద్రోణి ప్రభావం కారణంగా కొనసాగుతున్నాయని తెలిపింది. రాబోయే మూడు రోజులు రాయలసీమతో పాటు ఉత్తర ఆంధ్రాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని, నీటితో నిండిన రోడ్లపై ప్రయాణం చేయకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/