విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage)కి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో బ్యారేజీ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచనలు
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సత్య ప్రసాద్ సూచించారు. తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని అన్నారు.
అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలింపు
పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అత్యవసర సహాయ సేవలు అందుబాటులో ఉంచాలని, 24 గంటల పాటు రెవెన్యూ, పోలీసు, రెస్క్యూ బృందాలు ప్రజల సేవలో ఉండాలన్నారు. ప్రజలు భయపడకుండా, అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.
Read Also : RTA: వాహనాదారులపై RTA ఛార్జీల మోత