📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Haryana: ఈసీపై రాహుల్ గాంధీ ‘హెచ్ -బాంబు’

Author Icon By Tejaswini Y
Updated: November 5, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఆరోపణల ప్రకారం, హర్యానా(Haryana) అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ విస్తృతంగా జరిగిందని, దీనిపై ఎన్నికల సంఘం కళ్లుమూసుకుని కూర్చుందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ, గత ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల దోపిడీ జరిగిందని, తమ వద్ద దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హైడ్రోజన్ బాంబు పేరిట ఆయన చేసిన ఈ ప్రకటనలో, బీజేపీ నేతలు వ్యవస్థలను వాడుకొని సుమారు 25 లక్షల ఓట్లను దోచుకున్నారని ఆరోపించారు. పోలైన మొత్తం ఓట్లలో 12.5 శాతం వరకు నకిలీవని ఆయన తెలిపారు.

Read Also: Phool Makhana:ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ అందరికీ కాదు!

రాహుల్ గాంధీ వెల్లడించిన వివరాల ప్రకారం, హర్యానా(Haryana) ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కి చెందిన ఒక మోడల్‌ ఫొటోని వాడి 22 వేర్వేరు పేర్లతో ఓట్లు నమోదయ్యాయి. సీమా, స్వీటీ, సరస్వతి వంటి పేర్లతో, వయసులు మరియు లింగం మారుస్తూ ఆ ఫొటోతోనే 22 ఓట్లు సృష్టించారని ఆయన అన్నారు. అలాగే 93 వేలకుపైగా ఓట్లు తప్పుడు చిరునామాలతో ఉన్నాయని, కనీసం 5 లక్షల నకిలీ ఓటర్లు హర్యానాలో ఉన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. “ఎన్నికల కమిషన్ వద్ద నకిలీ ఓటర్లను గుర్తించే సాఫ్ట్‌వేర్ ఉంది. అయినప్పటికీ 5 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చారు?” అని ఆయన ప్రశ్నించారు.
ఈసీ తలచుకుంటే నకిలీ ఓట్లను సెకన్లలో తొలగించగలదని, కానీ బీజేపీకి అనుకూలంగా చూసీచూడనట్టు వదిలేశారని విమర్శించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటేసి, హర్యానాలోనూ ఓటేశారా?

రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ, ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటేసిన వేలాది మంది వ్యక్తులు హర్యానాలో కూడా ఓటేశారని తెలిపారు. “బీజేపీ సభ్యులైనంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేయచ్చా?” అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను ప్రదర్శించారు, ఇందులో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఎన్నికల ఫలితాల ముందు మాట్లాడుతూ – “అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, బీజేపీ విజయం సాధిస్తుంది” అని పేర్కొన్నట్లు చూపించారు.
దీని పై రాహుల్ స్పందిస్తూ – “ఏ ఏర్పాట్లు? పోలింగ్ పూర్తయిన రెండురోజుల తర్వాత అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా ఈ నాయకుడు నవ్వుతూ బీజేపీ ఏర్పాటు చేసిందని చెబుతున్నాడు” అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పేర్కొన్నట్టుగా, హర్యానా చరిత్రలో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మరియు పోలింగ్ బూత్ ఫలితాలు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయని, ఇది ఓట్ల చోరీకు స్పష్టమైన సంకేతమని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BJP ECI ElectionCommission FakeVoters HaryanaElections IndiaElections LokSabhaOppositionLeader PoliticalNews RahulGandhi RahulGandhiSpeech VoteRigging

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.