తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఒక వేడి చర్చను తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత టీ. హరీష్ రావు. ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
హరీష్ రావు వ్యాఖ్యలు
హరీష్ రావు వ్యాఖ్యల ప్రకారం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, మౌలిక, శ్రామిక, ఆరోగ్య రంగాల్లో గొప్ప పురోగతిని సాధించిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చిన కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఈ అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వెల్లడించిన కీలక విషయాలలో- స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖలో గతంలో 25.62 శాతం వృద్ధి, ఇప్పుడు మాత్రం కేవలం -1.93 శాతం తగ్గుదల చోటుచేసుకుందని తెలిపారు. ఇది ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు, అనాలోచిత నిర్ణయాల ఫలితమని స్పష్టం చేశారు. హరీష్ రావు ముఖ్యంగా హైడ్రా వ్యవస్థ, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో మార్పులు, మరియు ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఇవి అన్నీ నగర అభివృద్ధిని నాశనం చేస్తున్నాయని అన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం,హైదరాబాద్ లో పెట్టుబడిదారుల విశ్వాసం పోతోందని గట్టిగా హెచ్చరించారు. హైడ్రా వ్యవస్థ ద్వారా పెట్టుబడిదారులకు హైదరాబాద్ పై విశ్వాసం పోయేలా నిర్ణయాలు పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడం జరుగుతోంది. మూసి రివర్ ఫ్రంట్ పేరుతో దుర్వినియోగాలు, ప్రాజెక్టుల పునరావాసానికి సంబంధించి స్పష్టతలులేని విధానం అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి మార్గాన్ని ప్రదర్శిస్తుంది అన్న విషయం ఈ పరిణామాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలపై రాజకీయ విమర్శలు
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్ట్, టీఎస్ ఐపాస్, ఫార్మాసిటీ, టీఎస్ బీపాస్ లాంటి ప్రణాళికలు పక్కన పడేస్తే, రాష్ట్రానికి చాలా నష్టమవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గత పాలకుల ప్రణాళికలను కొనసాగించడంలో విఫలమవుతోందని, అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపడంలో అసమర్థంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి నిలబెట్టాలంటే ఇలా చెయ్యండి రాష్ట్ర అభివృద్ధిని నిలబెట్టాలని భావిస్తే మౌలిక సదుపాయాల పైన దృష్టి సారించి స్పష్టమైన మార్గదర్శకత్వంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. తాము ప్రారంభించిన అభివృద్ధి ప్రణాళికలను పక్కనపెట్టి మంచి అవకాశాలను కోల్పోతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న ప్రగతికి బాటలు వేయాలి అనే తీసుకోవలసి ఉంటుందని ఈ పోస్టు ద్వారా హరీష్ రావు స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read also: Dia Mirza: రేవంత్ రెడ్డిపై బాలీవుడ్ నటి దియా మీర్జా ఆగ్రహం..ఎందుకంటే?