Handri Niva Project : హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రాయలసీమ సాగునీటి చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా 40.109 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించడం విశేషం. కేవలం 190 రోజుల్లోనే డిజైన్డ్ కెపాసిటీని మించి ఈ స్థాయిలో నీటిని తరలించడం ద్వారా జలవనరుల శాఖ అరుదైన ఘనత సాధించింది.
ఈ చారిత్రక ఘట్టానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాయలసీమ మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ముందుచూపు, స్పష్టమైన ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ రికార్డు సాధ్యమైందని మంత్రులు కొనియాడారు. గతంలో ఒక్క పంపుతో ఉన్న సామర్థ్యాన్ని టీడీపీ హయాంలో 6 పంపులకు పెంచగా, ప్రస్తుత ప్రభుత్వంలో దాన్ని 12 పంపులకు విస్తరించినట్టు గుర్తు చేశారు.
Read Also: T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్
మచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం హంద్రీ–నీవాకు (Handri Niva Project) మలుపుగా మారిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ విజయంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర ఉందన్నారు. ఇక ఈ రికార్డుతో సరిపెట్టుకోవద్దని, మరో 10 టీఎంసీల నీటిని తరలించి మొత్తం 50 టీఎంసీల లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాయలసీమలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ నిండితేనే తన లక్ష్యం నెరవేరినట్టని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: