అమరావతి : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తమను కాంట్రాక్టు లెక్చరర్లుగా మార్పు చేసి 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. శాంక్షన్డ్ పోస్టుల్లోనే తాము సంవత్సరాల తరబడి పని చేస్తున్నామని, అతి తక్కువ జీతాలతో ఇస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. పూర్తి పరిశీలన నిమిత్తం సంఘం నాయకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన గురుకుల సిబ్బంది
By
sumalatha chinthakayala
Updated: December 3, 2024 • 4:51 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.