📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తండ్రి వర్ధంతికి బాలకృష్ణ ఘన నివాళి…

Author Icon By sumalatha chinthakayala
Updated: January 18, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో సోదరుడు రామకృష్ణతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీఆర్‌ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్‌ అంటే ఒక వర్సిటీ అని, జాతికి మార్గదర్శకమన్నారు. అలాంటి మహనీయులకు మరణం ఎప్పటికీ ఉండదని తెలిపారు.

https://twitter.com/yeswanth_p/status/1880477593734111593

ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, చరిత్ర అన్నారు బాలయ్య. తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నాలు మూలలా చాటి చెప్పడమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు. ప్రతి తెలుగు వాడికి సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అని ఆయన చెప్పారు. తెలుగు ప్రజల్లో రాజకీయాలపై ఆసక్తి, చైతన్యం పెంచిన వ్యక్తి అని, ప్రజల వద్దకు పాలన తీసుకు వచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ తెలిపారు. తన తండ్రి తీసుకు వచ్చిన పథకాల గురించి మరోసారి వివరించారు.

కాగా, నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఇంకా వేలాదిమంది అభిమానులు హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కు నివాళి అర్పిస్తున్నారు.

Balakrishna Tribute Google news NTR Death Anniversary NTR Ghat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.