ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే : హరీశ్ రావు

Read Time:  1 min
Government is fully responsible for this incident: Harish Rao
Government is fully responsible for this incident: Harish Rao
FONT SIZE
GET APP

కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపాటు

హైదరాబాద్‌: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులను మొదలు పెట్టి ప్రారంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనని దుయ్యబట్టారు. అంతేకాదు.. మొన్న సుంకిశాల రీటైనింగ్ వాల్ కూలిన ఘటన నేడు ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే

ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని గత నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా మట్టి కూలుతున్నదని గత నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా మట్టి కూలుతున్నదని గుర్తించినప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలడంతో పనికి వెల్లిన వారిలో 8 మంది ఇరుక్కుపోయినట్టు సమాచారం. ఈ ఘటన పై ట్విట్టర్ వేదిక పై స్పందించారు హరీశ్ రావు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని.. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. వెంటనే డీ-వాటరింగ్ చేసి, విద్యుత్‌ను పునరుద్ధరించి, శిథిలాలను తొలగించి కార్మికులను వెంటనే బయటకు తీసుకు రావాలని హరీశ్ రావు అన్నారు. ఈ ప్రమాద ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.