కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government hospital) చోటుచేసుకున్న వైద్య నిర్లక్ష్య ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తీవ్రంగా పరిగణించారు. రెండు చోట్ల జరిగిన తీవ్రమైన తప్పిదాల కారణంగా ఒక గర్భిణి మృతి చెందడం, మరో రోగి ఆరోగ్యం దెబ్బతిన్న విషయం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాకినాడ జీజీహెచ్‌లో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి మల్లేశ్వరి చికిత్స పొందుతుండగా విషాదం జరిగింది. ఆమెకు పాంటాప్రోజోల్ ఇంజెక్షన్ పడదని కేస్‌షీట్‌లో స్పష్టంగా నమోదు చేసినప్పటికీ, నవంబర్ 20న పీజీ విద్యార్థిని అదే ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె పరిస్థితి క్షీణించింది. ఫిట్స్ రావడంతో పాటు హార్ట్ అటాక్‌కు గురై అదే రాత్రి ఆమె మృతి చెందింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో తలెత్తిన లోపం కూడా ఈ ఘటనకు కారణమని అధికారుల ప్రారంభ నివేదిక వెల్లడించింది.
Read also: పాక్ నుంచి అక్రమ ఆయుధాల రవాణ: నలుగురు అరెస్టు
వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తప్పనిసరి: సీఎం హెచ్చరిక
రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో(Government hospital) గడువు ముగిసిన మందులు రోగికి అందించడం మరో పెద్ద నిర్లక్ష్యంగా బయటపడింది. అక్టోబర్ 2025లో ఎక్స్‌పైరీ ముగిసిన ఔషధాలను నవంబర్ 8న ఒక 55 ఏళ్ల రోగికి అందించగా, వాటిని వాడిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. ఈ రెండు ఘటనలపై తక్షణం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్య అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాకినాడ ఘటనలో మృతి చెందిన గర్భిణి కుటుంబానికి వెంటనే ఆర్థిక సహాయం అందించాలని కూడా సూచించారు. ఇలాంటి నిర్లక్ష్యాలు భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు హెచ్చరిక జారీ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: