हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Government hospital: వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం

Saritha
Latest news: Government hospital: వైద్యుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం

కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government hospital) చోటుచేసుకున్న వైద్య నిర్లక్ష్య ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) తీవ్రంగా పరిగణించారు. రెండు చోట్ల జరిగిన తీవ్రమైన తప్పిదాల కారణంగా ఒక గర్భిణి మృతి చెందడం, మరో రోగి ఆరోగ్యం దెబ్బతిన్న విషయం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాకినాడ జీజీహెచ్‌లో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన ఎనిమిది నెలల గర్భిణి మల్లేశ్వరి చికిత్స పొందుతుండగా విషాదం జరిగింది. ఆమెకు పాంటాప్రోజోల్ ఇంజెక్షన్ పడదని కేస్‌షీట్‌లో స్పష్టంగా నమోదు చేసినప్పటికీ, నవంబర్ 20న పీజీ విద్యార్థిని అదే ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె పరిస్థితి క్షీణించింది. ఫిట్స్ రావడంతో పాటు హార్ట్ అటాక్‌కు గురై అదే రాత్రి ఆమె మృతి చెందింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో తలెత్తిన లోపం కూడా ఈ ఘటనకు కారణమని అధికారుల ప్రారంభ నివేదిక వెల్లడించింది.

Read also: పాక్ నుంచి అక్రమ ఆయుధాల రవాణ: నలుగురు అరెస్టు

Government hospital
Chandrababu Naidu orders strict action against doctors’ negligence

వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తప్పనిసరి: సీఎం హెచ్చరిక

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో(Government hospital) గడువు ముగిసిన మందులు రోగికి అందించడం మరో పెద్ద నిర్లక్ష్యంగా బయటపడింది. అక్టోబర్ 2025లో ఎక్స్‌పైరీ ముగిసిన ఔషధాలను నవంబర్ 8న ఒక 55 ఏళ్ల రోగికి అందించగా, వాటిని వాడిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. ఈ రెండు ఘటనలపై తక్షణం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్య అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాకినాడ ఘటనలో మృతి చెందిన గర్భిణి కుటుంబానికి వెంటనే ఆర్థిక సహాయం అందించాలని కూడా సూచించారు. ఇలాంటి నిర్లక్ష్యాలు భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు హెచ్చరిక జారీ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870