📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest Telugu News: GST పై సామాన్యులకు గుడ్ న్యూస్

Author Icon By Vanipushpa
Updated: August 21, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇప్పటివరకు ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌ (GST)లను కేవలం రెండు ప్రామాణిక రేట్లకు తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మంత్రుల బృందం (GoM) అంగీకారం తెలిపింది. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు 5%, 12%, 18%, 28% స్లాబ్‌లుగా ఉన్నాయి. వీటి స్థానంలో 12%, 28% రేట్లను రద్దు చేసి, కేవలం 5%, 18% స్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని ఈ బృందం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి (DCM Shamart Choudari) ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రతిపాదనకు GOM ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకారం, రేట్ల హేతుబద్ధీకరణ వల్ల పరోక్ష పన్ను వ్యవస్థ మరింత సులభతరం కానుందని తెలిపింది. గృహాలు, రైతులు, మధ్యతరగతి వర్గం, MSME లకు ఉపశమనం కలుగుతుందని కేంద్రం పేర్కొంది. అలాగే పారదర్శకత పెరగడమే కాకుండా, వృద్ధి ఆధారిత పాలనకు ఇది దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారు.

GST పై సామాన్యులకు గుడ్ న్యూస్

ప్రత్యేకంగా 40% వరకు అధిక పన్ను
ప్రస్తుతం 12% స్లాబ్ కింద ఉన్న 99% వస్తువులు అన్నీ 5% స్లాబ్‌కు బదిలీ చేస్తారు. అలాగే 28% స్లాబ్ కింద ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్‌లో పరిధిలోకి వస్తాయి. మిగిలిన 5-7 శాతం వస్తువులు, అంటే హానికర వస్తువులు (సిగరెట్లు, టొబాకో, లగ్జరీ వస్తువులు మొదలైనవి)పై ప్రత్యేకంగా 40% వరకు అధిక పన్ను విధించే అవకాశం ఉంది. GoMలో ఆరుగురు సభ్యులు ఎవరంటే.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి (అధ్యక్షుడు) ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో మరో కీలక అంశంపై కూడా చర్చ జరిగింది.
అన్ని రాష్ట్రాల మద్దతు
వ్యక్తుల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను GST నుండి మినహాయించాలని దాదాపు అన్ని రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. అయితే, ఇది అమలులోకి వస్తే కేంద్రానికి సుమారు రూ. 9,700 కోట్ల వార్షిక ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయినప్పటికీ పాలసీదారులకు ఉపశమనం కలగాలని రాష్ట్రాలన్నీ అంగీకారం తెలిపాయి. ఈ మార్పులు అమలులోకి వస్తే.. వినియోగదారులకు ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది, ముఖ్యంగా 12% కింద ఉన్న వస్తువులు ఇప్పుడు 5%కి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారులకు పన్ను లెక్కలు సులభతరం అవుతాయి.అలాగే మధ్యతరగతి, రైతులు, చిన్న వ్యాపారాలకు నేరుగా ఉపశమనం దొరుకుతుంది. ప్రభుత్వ ఆదాయానికి కొంత ప్రభావం పడినా, దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి వేగవంతమయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఏదేమైనా కొత్త జీఎస్టీ వ్యవస్థ మరింత సులభతరం అవుతూ, ప్రజలకు, వ్యాపారులకు లాభదాయకంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో GST ఏ సంవత్సరం ప్రారంభమైంది?
వస్తువులు మరియు సేవల పన్ను చట్టం 2017 మార్చి 29న పార్లమెంటులో ఆమోదించబడింది మరియు జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. మరో మాటలో చెప్పాలంటే, వస్తువులు మరియు సేవల సరఫరాపై వస్తువులు మరియు సేవల పన్ను (GST) విధించబడుతుంది.
జిఎస్‌టి అంటే ఏమిటి?
వస్తువులు మరియు సేవల పన్ను
జిఎస్‌టి, లేదా వస్తువులు మరియు సేవల పన్ను, అనేది వస్తువులు మరియు సేవల సరఫరాపై విధించే పరోక్ష పన్ను. ఇది ప్రతి విలువ జోడింపుపై విధించే బహుళ-దశల, గమ్యస్థాన-ఆధారిత పన్ను, ఇది వ్యాట్, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నులు మొదలైన బహుళ పరోక్ష పన్నులను భర్తీ చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-news-pak-pak-airspace-banned-for-indian-flights-till-september-23/national/533875/

common people Government Policy GST Indian Economy Latest News Breaking News tax relief Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.