ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించేలా ఈ వేడుకలను మహా కుంభమేళా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం, 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై కీలక ప్రణాళికలను రూపొందించింది. ఈ మహా వేడుకలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల గుండా ప్రవహించే గోదావరి నది తీరంలో ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సుమారు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీని తట్టుకునేలా మరియు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 369 స్నాన ఘట్టాలను (Ghats) అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు.
AP Liquor Case : లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్
పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల వసతి కోసం ప్రభుత్వం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా టెంట్ సిటీలు (Tent Cities) ఏర్పాటు చేయడంతో పాటు, స్థానికంగా హోమ్ స్టే (Home Stay) సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల యాత్రికులకు వసతి సమస్య తీరడమే కాకుండా స్థానికులకు ఉపాధి కూడా లభిస్తుంది. కేవలం స్నాన ఘట్టాలకే పరిమితం కాకుండా, గోదావరి పరివాహక ప్రాంతంలోని 434 పురాతన ఆలయాలకు భారీ ఎత్తున మరమ్మతులు చేపట్టి, వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహించేలా రోడ్ల నిర్మాణం, రవాణా సౌకర్యాలు మరియు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :