📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Atrocious : పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష

Author Icon By Sudheer
Updated: April 10, 2025 • 9:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు పీరియడ్స్ వచ్చాయని క్లాస్ రూమ్‌లోనికి అనుమతించకుండా స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను బయట కూర్చోబెట్టారు. అందులోనూ 2 రోజుల పాటు జరిగే పరీక్షల్ని ఆమె క్లాస్ రూమ్ వెలుపలే రాయించడమంటే అసహ్యకరమైన విషయమే. ఈ తీరుపై విద్యార్థినిపై మానసిక ఒత్తిడిని తీసుకొచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు.

తల్లి ఆగ్రహం – యాజమాన్యాన్ని నిలదీత

ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థిని తల్లి తీవ్రంగా స్పందించారు. వెంటనే స్కూల్‌కి చేరుకుని ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. తమ బిడ్డను ఇలా అందరి ముందూ అవమానపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థినిపై మానసికంగా ఒత్తిడి కలిగేలా ప్రవర్తించడమే కాకుండా, విద్యా హక్కును కూడా హరిస్తున్నారని చెప్పారు. అనంతరం ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ఆగ్రహం

ఈ అమానుష ఘటనపై సమాచారం బయటకు వచ్చాక, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 21వ శతాబ్దంలోనూ ఈ విధమైన పిచ్చి ఆచారాలు, అవగాహన లేకపోవడం తల్లి, బాలికకు ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఓ ప్రిన్సిపల్‌ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పీరియడ్స్‌ విషయంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత కలిగిన విద్యా సంస్థలే ఇలా వ్యవహరించడం దారుణమని విస్తుపడుతున్నారు.

Exam Hall Due To Periods Girl Made To Sit Google News in Telugu Periods

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.