📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

Pithapuram Varma : వైసీపీలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ?

Author Icon By Sudheer
Updated: September 12, 2025 • 9:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మళ్లీ రాజకీయ చర్చలకు వేదికైంది. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ (Varma) వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వర్మకు స్థానికంగా మంచి పట్టు ఉండటంతో పాటు అభిమాన వర్గం కూడా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారని భావించే ఆయన అనుచరులు ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ హామీ నెరవేర్చాలని టీడీపీ కేడర్‌లో డిమాండ్ వినిపిస్తోంది.

ముద్రగడను కలిసిన వ‌ర్మపై ఊహాగానాలు

ఇటీవల వర్మ కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి(Mudragada)ని ఆయన నివాసంలో కలిసిన నేపథ్యంలో ఈ వార్తల ఊపందుకుంది. ముద్రగడ అనారోగ్యాన్ని విచారించడానికి మాత్రమే వెళ్లినా, ఆ సమావేశం ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో వర్మ వైసీపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. దీనిపై వర్మ కానీ, ముద్రగడ కానీ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఊహాగానాలు మరింత వేడెక్కుతున్నాయి. అయితే, దీనిపై వైసీపీ సోషల్ మీడియా అధిక ఉత్సాహం ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

టీడీపీ కేడర్‌ ఆగ్రహం, స్పష్టత కోసం ఎదురుచూపులు

వర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లతో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆయ‌న పార్టీని వదిలే పరిస్థితి రాదని స్థానిక టీడీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. వర్మకు తిరుగులేని క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నా కూడా, వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. కేవలం ముద్రగడను పరామర్శించడానికి వెళ్లిన సందర్భాన్ని వక్రీకరించడం అనవసరమని పేర్కొంటున్నారు. ఇకపై వర్మ నోరు విప్పి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని, లేకపోతే పిఠాపురంలో టీడీపీ-జనసేన వర్గపోరు మరింత ముదురుతుందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

https://vaartha.com/alert-to-motorists-these-are-now-mandatory/telangana/546213/

Google News in Telugu mudrgada varma varma joins ycp ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.