हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Breaking News – Air Services : రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య విమాన సర్వీసులు

Sudheer
Breaking News – Air Services : రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాజమహేంద్రవరం–తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు(New flight service between Rajahmundry and Tirupati)లను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రకటించారు. తొలి సర్వీసు అక్టోబర్ 1 ఉదయం 9:25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకోనుంది. తిరిగి ఉదయం 10:15 గంటలకు రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి బయలుదేరుతుంది. ఈ కొత్త సర్వీసుతో రెండు నగరాల మధ్య ప్రయాణం సులభతరం కానుంది.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు (మంగళవారం, గురువారం, శనివారం) నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు భక్తులకు, వ్యాపార వర్గాలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి (Tirumala) వచ్చే భక్తులకు, గోదావరి జిల్లాల నుంచి సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది. ఇక రాజమహేంద్రవరం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ సౌకర్యం లభిస్తుంది.

ప్రతీ రోజూ విమాన షెడ్యూల్ ప్రకారం ఉదయం 7:40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:50 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరుతుంది. ఈ సర్వీసులు రెండు నగరాల ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను మరింత బలపరచనున్నాయి. కేంద్ర ప్రభుత్వ యూడాన్ (UDAN) పథకం కింద ఈ సేవలు అందుబాటులోకి రావడం రాష్ట్ర విమాన ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.

https://vaartha.com/mohanlal-prime-minister-modi-congratulates-mohanlal/national/551233/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870