📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: Godavari:మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, అధికార యంత్రాంగం అప్రమత్తం

Author Icon By Pooja
Updated: September 27, 2025 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగింది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 34.8 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం(Water level) క్రమక్రమంగా పెరుగుతూ శనివారం ఉదయం 6 గంటలకు చేరుకుంది. ఉదయం 8 గంటలకు 41.6 అడుగులు, 9 గంటలకు 42 అడుగులు, 10 గంటలకు 42.30 అడుగులు, 11 గంటలకు 42.5 అడుగులు, 12 గంటలకు 43 అడుగులకు చేరుకోగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు 43.27 అడుగులు, 2 గంటలకు 43.50 అడుగులు మూడు గంటలకు 43.90 డుగులు, నాలుగు గంటలకు 44. 20 అడుగులు ఐదు గంటలకు 44.50 అడుగులు, 6 గంటలకు 44.70 అడుగులు ఎనిమిది గంటలకు 45.10 అడుగులు ఎత్తులో 10,18,806 క్యూసెక్కుల వరద నీరు దిగువ ప్రాంతానికి పయనం అవుతుంది.

Read Also : Asifabad District: ఎలుగుబంటి దాడిలో దంపతులు మృతి

కాగా నేడు ఉదయం 47 అడుగుల చేరువలో గోదావరి ప్రవాహం ఉండనుందని సంబంధిత అధికారులు అంచనాకు వస్తున్నారు. ఆ తర్వాత మరో రెండు అడుగులు తగ్గి మరల అదే స్థాయికి పెరగనుందని తెలుపుతున్నారు. ఈ వారం రోజులు కూడా గోదావరి ఇదే స్థాయిలో ప్రవహించనుందని వెల్లడిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షి స్తున్నదని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొ న్నారు. అప్రమత్తమైన(Alert) అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల జాబితాను సిద్ధం చేయగా ७గ్రామాలను తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు విస్తృతంగా పర్యటించి ఆ గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి ఎప్పుడు వరదలు ముంచుకొచ్చినా అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లవద్దన హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh First Danger Warning flood alert Godavari Heavy Rains Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.