Fire Accident : పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం

Read Time:  1 min
Fire breaks out at Park Hyatt Hotel
Fire breaks out at Park Hyatt Hotel
FONT SIZE
GET APP

Fire Accident : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావటంతో హోటల్ సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ నుండి ఒక ఫైర్ ఇంజిన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే ఘటన జరిగిన సమయంలో హోటల్ ఆరో అంతస్తులో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు ఉన్నారు. ఆ వెంటనే వారు హోటల్ ఖాళీ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్ని

మొదటి అంతస్తులో విద్యుత్ వైరింగ్‌లో సమస్య

కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని తెలిసింది. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైరింగ్‌లో సమస్య తలెత్తడం వల్ల పొగలు వచ్చాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు కూడా విచారణ చేపట్టారు.

Read Also : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.