📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

Fee Reimbursement Colleges Bandh : నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

Author Icon By Sudheer
Updated: November 3, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థలు నేడు భారీ ఆందోళన ప్రారంభించాయి. ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం (FATHI) బంద్‌కి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి అన్ని ప్రైవేట్ కాలేజీలు మూసివేయబడ్డాయి. బకాయిలు పూర్తిగా చెల్లించేవరకు కాలేజీలు తిరిగి తెరవబోమని సంఘం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Breaking News – Papikondala Boating: పాపికొండల బోటింగ్ షురూ

ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యులు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వందల కోట్ల రూపాయలుగా పెరిగిపోయాయని, కాలేజీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. సిబ్బంది వేతనాలు, విద్యార్థుల సదుపాయాలు, ల్యాబ్‌ ఫెసిలిటీల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. అనేక కాలేజీలు రుణాలపైనే నడుస్తున్నాయని, ప్రభుత్వం వాగ్దానాలు మాత్రమే చేస్తోందని ఆరోపించారు. గతంలో కూడా పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అటు ప్రభుత్వం తీరుపై విద్యా రంగం అంతటా అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం చెల్లింపులు చేయకపోతే ఆందోళనను మరింత ముమ్మరం చేస్తామని FATHI హెచ్చరించింది. నవంబర్ 6న హైదరాబాద్‌లో లక్షన్నర మంది సిబ్బందితో భారీ సమావేశం ఏర్పాటు చేసి, సమస్య పరిష్కారం కోసం చివరి హెచ్చరిక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకముందే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. ఈ పరిణామాలతో రాష్ట్ర విద్యా వ్యవస్థ మరోసారి చర్చనీయాంశమవుతోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

cm revanth Fee Reimbursement Colleges Bandh Google News in Telugu Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.