తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2025–26కి భారీ ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది రూ.27,623 కోట్లు రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా ఈ లెక్కలు చేరేందుకు కసరత్తు మొదలైంది.రాష్ట్రంలో వాడకంలో లేని 40 బార్లను మళ్లీ ప్రారంభించనుంది. వీటిలో 25 బార్లకు సంబంధించి కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.జీహెచ్‌ఎంసీ పరిధి మినహా మిగిలిన చోట్ల ఈ ప్రక్రియ మొదలైంది.దరఖాస్తు ఫీజు రూ.1 లక్షగా నిర్ణయించారు.గడువు ఈ నెల 26వ తేదీ వరకు ఉంది. ఒక్కో బార్ లైసెన్స్ ఫీజు రూ.30 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు ఉంటుంది.ఈ కొత్త బార్ల ద్వారా ఏడాదికి కనీసం రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
బీర్, మద్యం అమ్మకాల వల్ల వచ్చే ఆదాయం ఇంకా ఎక్కువే అని అధికారులు భావిస్తున్నారు.ఇటీవల బీర్ల రేట్లు పెంచిన తరువాత ఆదాయం భారీగా పెరిగింది. ప్రతినెలా దాదాపు రూ.170 కోట్లు అదనంగా వస్తున్నట్లు అధికారుల అంచనా.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,620 రిటైల్ మద్యం షాపులు ఉన్నాయి.వీటికి ఉన్న లైసెన్స్ గడువు 2023–25 మధ్య ముగియనుంది.ఈ డిసెంబరులో కొత్త టెండర్లు రానున్నాయి.అందులో దరఖాస్తుల విక్రయం ద్వారా రూ.250 కోట్లు వస్తుందని అంచనా.లైసెన్స్ ఫీజుగా ఏడాదికి రూ.400 కోట్లు అందే అవకాశం ఉంది.దేశీయ విదేశీ లిక్కర్ కంపెనీలు తమ బ్రాండ్లను తెలంగాణలో అమ్మేందుకు టీజీబీసీఎల్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి మరింత బలపడనుంది.
Read Also : TSRTC Employees Strike : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్… మే 6వ తేదీ