📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

MUDA Scam : ముడా కేసులో రూ.100కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ !

Author Icon By Sudha
Updated: June 10, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్‌ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు (Temporary seizure) చేసింది. ఇప్పటి వరకు రూ.400కోట్ల విలువైన ఆస్తులు ఈ కేసులో జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

MUDA Scam : ముడా కేసులో రూ.100కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ !

బడా వ్యక్తులకు బినామీలు
స్వాధీనం చేసుకున్న ఆస్తులు సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని.. ముడా అధికారులతో సహా పలువురు బడా వ్యక్తులకు బినామీలుగా ఉన్న వ్యక్తులపై ఈ ఆస్తులు ఉన్నాయని ఏజెన్సీ ఆరోపించింది. ఇప్పటివరకు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్‌ ప్రకారంగా రూ.400కోట్లుగా ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై 1860 నాటి భారత శిక్షాస్మృతి, 1988 నాటి అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మైసూర్‌లోని లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ముడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. జీటీ దినేష్‌ కుమార్‌ సహా మాజీ ముడా కమిషనర్ల పాత్ర అనర్హమైన సంస్థలు, వ్యక్తులకు పరిహారంగా స్థలాలు కేటాయించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సైతం కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరించినట్లుగా సమాచారం.
నిబంధనలకు విరుద్ధం
కేసు విషయానికి మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MUDA)కి చెందిన 3.2 ఎకరాల భూమి విషయంలో కుంభకోణానికి సంబంధించింది. అయితే, వాస్తవానికి సతీమణి పార్వతికి 2010లో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కేసరే గ్రామంలోని 3.2 ఎకరాల భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ భూమిని ముడా సేకరించింది. ఆ భూమికి పరిహారం ఇవ్వాలని పార్వతి డిమాండ్‌ చేయడంతో ముడా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయానగర్‌లో 14 ప్లాట్లను కేటాయించింది. ఈ ప్లాట్ల ధర.. ఆమె ఇచ్చిన భూమి ధర కంటే ఎంతో విలువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు కేటాయించారని మండిపడుతున్నాయి. ఈ భూ కుంభకోణం విలువ రూ.3వేలకోట్ల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Read Also:Katrina Kaif: మాల్దీవ్స్ గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క‌త్రినా కైఫ్‌

Breaking News in Telugu ED seizes assets Google news Google News in Telugu in Muda case! Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News Paper Telugu News Today Today news worth Rs 100 crore

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.