📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ED Raids : పాతబస్తీలో ఈడీ సోదాలు

Author Icon By Sudheer
Updated: June 20, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ పాతబస్తీలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. భూదాన్ భూముల అక్రమాల వ్యవహారంలో ప్రముఖ వ్యాపారి ఫర్హోన్, మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్‌ల నివాసాలతో పాటు వారి కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మహేశ్వరంలో వంద ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల బృందం ఉదయం నుంచే పాతబస్తీలో సోదాలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అబ్దుల్లాపూర్‌మెట్ భూముల వివాదం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హయాంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ ఆక్రమణలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సర్వే నంబర్‌ 17లో ఉన్న ఈ భూమిలో ప్రైవేట్ భూమి పేరు చెప్పి మరికొంత ప్రభుత్వ భూమిని కూడా వెంచర్‌లో కలిపారని సమాచారం. రైతులు తమ భూముల్లో అక్రమ వెంచర్ వేస్తున్నారని అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడంతో ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు.

ఫర్హోన్‌పై ఆరోపణలు – భారీ షోరూమ్‌లు, ఆస్తులపై విచారణ

నగరంలో ఫర్హోన్ ప్రముఖ వ్యాపారిగా కొనసాగుతుండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో అతనికి భారీ షోరూమ్‌లు ఉన్నాయి. భూదాన్ భూముల అక్రమ కొనుగోళ్లు, కబ్జా వ్యవహారాల్లో అతని పాత్రపై ఈడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆస్తుల వివరాలు, లావాదేవీలపై గట్టి ఆధారాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తుతో పాతబస్తీలో కలకలం రేగింది.

Read Also : Teasor release: అందరూ ఎదురుచూస్తున్న ‘నిలవే’ టీజ‌ర్ విడదల

Bhoodan Land Issue Bhoodan Yagna movement ED raids Google News in Telugu Old City Hyderabad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.