📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఈయూకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 3, 2025 • 10:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు హెచ్చరికలు జారీ చేశారు. ఈయూ తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఈయూ కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ అన్నంత పనీ చేస్తే తాము కూడా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.

27 దేశాల యూరోపియన్ యూనియన్‌పై సుంకాల విధింపు గురించి ఆలోచిస్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘ఈయూపై సుంకాలు విధిస్తాం. మీకు నిజమైన సమాధానం కావాలా? లేక రాజకీయ పరమైన సమాధానం కోరుకుంటున్నారా?’’ అని అయన ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ తమను దారుణంగా ట్రీట్ చేసిందని ఆయన విమర్శించారు. ట్రంప్ తన మొదటి విడత పదవీకాలంలోనూ యూరోపియన్ యూనియన్ స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఇది ఈయూతో వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీ, మోటార్ సైకిళ్లు సహా పలు వస్తువులపై సంకాలు విధించి ప్రతీకారం తీర్చుకుంది.

కాగా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న అగ్రరాజ్య అధినేత.. ఆ హెచ్చరికలను నిజం చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధించే దస్త్రంపై శనివారం సంతకం చేశారు. దీంతో ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌కు తెరలేచింది. దీనికి ప్రతిస్పందనగా కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి తమదేశానికి వచ్చే 155 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై తాము 25 శాతం సుంకాలు విధించినట్టు, వాటిని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల ప్రభావం మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌పై సైతం రేపో మాపో ఆంక్షలు విధించే అవకాశముందని వారు తెలిపారు. అమెరికా చర్యపై చైనా డబ్ల్యూటీవోను ఆశ్రయించినా, ప్రతీకార చర్యలకు దిగినా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా పలు అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు. పైగా దీని కారణంగా అమెరికా వృద్ధి తగ్గుతుందని, మిగిలిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని అవి హెచ్చరిస్తున్నాయి.

canada Donald Trump European Union tariffs USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.