📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Latest Telugu News: White House టిక్ టాక్ అకౌంట్ ను ప్రారంభించిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: August 20, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకవైపు టిక్ టాక్(Tiktok) పై నిషేధం కత్తి వేలాడుతుండగానే, మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్(White House) అనూహ్యంగా చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్(Social Media) టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టింది. జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ఏ యాప్‌నైతే నిషేధించాలని అమెరికా సర్కార్ భావించిందో, ఇప్పుడు అదే వేదికగా తమ ప్రచారాన్ని ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా టిక్‌టాక్‌ ఖాతాను ప్రారంభించి, తొలి పోస్టును కూడా విడుదల చేసింది. “మేము తిరిగి వచ్చాం! వాట్స్ అప్ టిక్‌టాక్?” అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల నిడివి ఉన్న వీడియోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. ఈ ఖాతా తెరిచిన గంటలోనే సుమారు 4,500 మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ఈ పరిణామం ట్రంప్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. చైనాకు చెందిన బైట్‌డాన్స్ సంస్థ యాజమాన్యంలో నడుస్తున్న టిక్‌టాక్‌ను అమెరికాలో విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని గతంలోనే ట్రంప్(Trump) చట్టం తీసుకొచ్చారు.

White House టిక్ టాక్ అకౌంట్ ను ప్రారంభించిన ట్రంప్

అమెరికాలో దానిపై నిషేధం అమలు కావడం ఖాయం
ఈ చట్టం ప్రకారం, జనవరి 19 నాటికే నిషేధం అమలు కావాల్సి ఉన్నా, అధ్యక్షుడు ట్రంప్ దానిని నిలిపివేశారు. ఆ తర్వాత జూన్ మధ్యలో మరో 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు సెప్టెంబర్ మధ్య నాటికి ముగియనుంది. ఈలోగా చైనాకు చెందని సంస్థకు టిక్‌టాక్‌ను విక్రయించకపోతే అమెరికాలో దానిపై నిషేధం అమలు కావడం ఖాయం. అయితే, యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో టిక్‌టాక్ కీలక పాత్ర పోషిస్తోందని భావించిన ట్రంప్, తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో నిషేధానికి గట్టిగా మద్దతు పలికిన ఆయనే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్‌కు టిక్‌టాక్‌లో 110.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, 2024 నవంబర్ 5న జరిగిన ఎన్నికల రోజు తర్వాత ఆయన ఆ ఖాతాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇక ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైట్ హౌస్‌కు ఎక్స్ లో 2.4 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 9.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/white-house-extra-tariffs-on-india-to-pressure-russia/international/533161/

Donald Trump Latest News Breaking News Social Media Telugu News tiktok Trump news US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.