📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

US : అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త పథకం

Author Icon By Sudheer
Updated: May 6, 2025 • 8:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లే వారిని ప్రోత్సహించేందుకు ప్రతిదీ సిద్దం చేసింది. ఈ పథకం కింద, తమ స్వదేశానికి తిరిగి వెళ్లే వారికి 1000 డాలర్ల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

‘CBP One’ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌

ఈ కార్యక్రమం అమలు కోసం ‘CBP One’ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా అక్రమ వలసదారులు తమ వివరాలు నమోదు చేసుకుని, తిరిగి వెళ్ళినట్లు ధృవీకరించిన తర్వాత, వారికి ప్రోత్సాహక మొత్తాన్ని అందజేస్తారు. ఈ విధానం ద్వారా వలసదారుల బహిష్కరణకు అయ్యే ఖర్చు 70% వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరి బహిష్కరణకు సగటున 17,000 డాలర్లకు పైగా ఖర్చవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

వలసదారులు అరెస్టుకు లోనవకుండా, చట్టపరమైన పరిష్కారం

ఈ పథకం అమలుతో వలసదారులు అరెస్టుకు లోనవకుండా, చట్టపరమైన పరిష్కారంగా స్వదేశానికి తిరిగి వెళతారని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ తన పాలనలో వలస నియంత్రణకు ప్రాధాన్యతనిస్తానని ఎన్నోసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయపరమైన పరిమితులు, సామర్థ్యలేమి కారణంగా తగిన స్థాయిలో బహిష్కరణలు జరగలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పథకం వలస నియంత్రణలో ప్రధానంగా పనిచేస్తుందని ట్రంప్ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Read Also : Injury : సుజనా చౌదరికి తీవ్ర గాయం

Donald Trump illegal immigrants Trump Government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.