ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ (Swiggy) విడుదల చేసిన 2024 వార్షిక నివేదిక ‘స్టాటిస్టిక్స్’ (StatEATstics) ప్రకారం, భారతీయ భోజన ప్రియుల మనసు గెలుచుకోవడంలో బిర్యానీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. వరుసగా పదో ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకంగా బిర్యానీ రికార్డు సృష్టించడం విశేషం. ఈ ఏడాది ఏకంగా 93 మిలియన్ల (9.3 కోట్లు) బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీ ద్వారా జరిగాయని సంస్థ వెల్లడించింది. అంటే దేశవ్యాప్తంగా ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ ప్లేస్ అవుతోందంటే, ఈ వంటకానికి ఉన్న క్రేజ్ ఏ స్థాయిందో అర్థం చేసుకోవచ్చు.
Harish Rao: KCR ప్రెస్‌మీట్‌తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడింది
బిర్యానీ తర్వాత స్థానాలను పరిశీలిస్తే, పాశ్చాత్య మరియు దేశీయ రుచులు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ జాబితాలో బర్గర్లు 44.2 మిలియన్ల ఆర్డర్లతో రెండో స్థానంలో నిలవగా, పిజ్జాలు 40.1 మిలియన్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. మన దేశీయ అల్పాహారం వెజ్ దోశ 26.2 మిలియన్ల ఆర్డర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కేవలం ప్రధాన నగరాల్లోనే కాకుండా, ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ మరియు సంప్రదాయ వంటకాలకు గిరాకీ విపరీతంగా పెరగడం ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తోంది.
భారతీయ ఆహారపు అలవాట్లలో వస్తున్న ఈ పెను మార్పులు టెక్నాలజీ మరియు సౌలభ్యం (Convenience) చుట్టూ తిరుగుతున్నాయి. పండగలు, వారాంతాలు మరియు క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరుగుతోందని స్విగ్గీ పేర్కొంది. బిర్యానీలో ముఖ్యంగా ‘హైదరాబాదీ బిర్యానీ’ రకం అత్యధికంగా ఆర్డర్ చేయబడటం గమనార్హం. కేవలం భోజనం కోసమే కాకుండా, వివిధ సందర్భాల్లో జనం బయటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారని, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో (Late-night orders) కూడా బిర్యానీ మరియు స్నాక్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందని ఈ గణాంకాలు విశ్లేషిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com