కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాల వేళ విందు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) డిన్నర్ పార్టీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
Read Also : http://Parliament speech India : 102° జ్వరం ఉన్నా? అమిత్ షా పార్లమెంట్‌లో ఘాటు వ్యాఖ్యలు…
బేలాలో పార్టీ నేత ప్రవీణ్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో గురువారం రాత్రి జరిగిన ఈ విందు భేటీలో దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు మంత్రులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతకుముందు సీఎం సిద్ధరామయ్య కూడా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో డిన్నర్ చేయడం గమనార్హం. వారికి బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఆతిథ్యం ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల వేళ సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఇలా వేర్వేరు డిన్నర్ మీట్‌లు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: