📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Dilsukhnagar blasts case : దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష

Author Icon By sumalatha chinthakayala
Updated: April 8, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dilsukhnagarblasts case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 2013 ఫిబ్రవరి 21 న జరిగిన దిల్ సుఖ్ నగర్ జంట బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ చర్యగా గుర్తించింది NIA కోర్టు. ఈ జంట పేలుళ్లో లో 17 మంది మృతి చెందగా, 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో యాసినన్ బత్కల్ కిలక సూత్రధారిగా గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు నిందితులకు NIA స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఏ-1 గా అసదుల్లాహ అక్తర్, ఏ-2 యాసిన్ భక్తల్, ఏ-3 తహసిన్ అక్తర్, ఏ-4 గా జియావుర్ రెహ్మాన్,ఏ5 గా ఎజాక్ షాయిక్ లను దోషులుగా తేల్చింది.

ఉరిశిక్ష సరైనదేనంటూ తీర్పు

కాగా, జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్‌‌ రియాజ్‌‌ అలియాస్‌‌ రియాజ్‌‌ భత్కల్‌‌ పరారీలో ఉండగా, మిగిలిన అసదుల్లా అక్తర్‌‌ అలియాస్‌‌ హద్ది, జియా ఉర్‌‌ రహమాన్‌‌ అలియాస్‌‌ వఘాస్‌‌, మహమ్మద్ తహసీన్‌‌ అక్తర్‌‌ అలియాస్‌‌ హసన్, మహమ్మద్‌‌ అహ్మద్‌‌ సిద్ధిబప అలియాస్‌‌ యాసిన్‌‌ భత్కల్‌‌, అజాజ్‌‌ షేక్‌‌ అలియాస్‌‌ సమర్‌‌ ఆర్మాన్‌‌ తుండె అయిదుగురికి ఎన్‌‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే NIA కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. వాదనల అనంతరం ఏప్రిల్ 8న నిందితుల పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్ష సరైనదేనంటూ తీర్పునిచ్చింది.

టిఫిన్ బాక్సులో బాంబు పెట్టిన టెర్రరిస్టులు

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే.. 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల ధాటికి 17 మంది మరణించగా, దాదాపు 130 మందికిపైగా గాయపడ్డారు.బ్లాస్ట్ కేసును NIA దర్యాప్తు చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌ (యూపీ), జియా-ఉర్‌-రెహమాన్‌ (పాకిస్థాన్‌), తెహసీన్‌ అక్తర్‌ (బీహార్‌), అజాజ్‌ షేక్‌ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

Read Also : మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం..కానిస్టేబుల్‌ మృతి

Breaking News in Telugu death sentence Dilsukhnagar Bomb Blasts Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telangana High Court Telugu News Telugu News online Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.