📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Donald Trump : ముస్లిం దేశాలను తప్పుదోవ పట్టించిన ట్రంప్?

Author Icon By Sudheer
Updated: October 2, 2025 • 8:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump ) ప్రతిపాదించిన గాజా పీస్ డీల్ కు ఖతర్, పాకిస్తాన్ సహా ఎనిమిది ముస్లిం దేశాలు ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, హమాస్‌కు ఒరిజినల్ డీల్ కాకుండా వేరే పేపర్స్ పంపినట్లు అమెరికా ఆధారిత మీడియా రిపోర్టులు వెలువరించాయి. దీంతో ఈ ఒప్పందంపై కొత్త వివాదం తలెత్తింది.

Ramreddy Damodar Reddy Dies : మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత

వార్తల ప్రకారం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూచనల మేరకు ట్రంప్ ప్రతిపాదించిన ఒరిజినల్ ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పులు ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్న కండీషన్లను కలిగి ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు, హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను వదులుకోవాలని ఒప్పందంలో షరతుగా పెట్టడం, భవిష్యత్ సరిహద్దు నియంత్రణపై ఇజ్రాయెల్‌కు అధిక హక్కులు ఇవ్వడం వంటి అంశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మార్పులే హమాస్‌ను అసంతృప్తికి గురి చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక హమాస్ ఈ ఒప్పందంలోని కొన్ని కీలక అంశాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆయుధాలను పూర్తిగా వదులుకోవాలన్న రూల్, కొన్ని రాజకీయ–ప్రాంతీయ షరతులు హమాస్‌కు అభ్యంతరం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గాజా పీస్ డీల్ భవిష్యత్తు ఏమవుతుందో అనిశ్చితి నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నప్పటికీ, హమాస్ ఈ షరతులను అంగీకరిస్తుందా? లేక కొత్త ప్రతిపాదనలు వస్తాయా? అన్న ప్రశ్నలపై అంతర్జాతీయ దృష్టి కేంద్రీకృతమవుతోంది.

Donald Trump Google News in Telugu Muslim countries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.