Delhi missing cases : ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్, ఏం జరుగుతోంది?

Read Time:  1 min
Delhi missing cases
Delhi missing cases
FONT SIZE
GET APP

Delhi missing cases : దేశ రాజధాని ఢిల్లీలో అదృశ్యాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు, యువతులు కనిపించకుండా పోతుండటంతో తల్లిదండ్రుల్లో తీవ్ర భయం నెలకొంది. 2026 సంవత్సరం ప్రారంభమైన కేవలం 27 రోజుల్లోనే మొత్తం 807 మంది మిస్సింగ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. అంటే రోజుకు సగటున 27 మంది అదృశ్యమవుతున్నారు.

ఇందులో పోలీసులు ఇప్పటివరకు 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఇంకా 572 మంది ఆచూకీ తెలియకపోవడం కలవరపెడుతోంది. కనిపెట్టిన వారి కంటే కనిపించని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చుతోంది.

Read Also: AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

Delhi missing cases
Delhi missing cases

చిన్నారుల పరిస్థితి మరింత ఆందోళనకరం

కేవలం 27 రోజుల్లోనే 191 మంది మైనర్లు మిస్సింగ్ అయ్యారు. వారిలో కేవలం 48 మందిని మాత్రమే పోలీసులు రికవర్ చేశారు. మిగతా పిల్లల జాడ తెలియలేదు. వీరిలో 120 మంది బాలికలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ (Delhi missing cases) రవాణా, కిడ్నాప్, బలవంతపు పనుల కోసం ఈ ఘటనలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కౌమారదశ పిల్లలే ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత పదేళ్లలో (2016–2026) ఢిల్లీలో 60 వేలకుపైగా చిన్నారులు అదృశ్యమైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పోలీసులు ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు చేపడుతుండగా, తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

// ── Embeds ── if (document.querySelector('blockquote.twitter-tweet, .twitter-tweet')) { const s = document.createElement('script'); s.src = 'https://platform.twitter.com/widgets.js'; s.async = true; s.charset = 'utf-8'; document.body.appendChild(s); } if (document.querySelector('.instagram-media')) { const s = document.createElement('script'); s.src = 'https://www.instagram.com/embed.js'; s.async = true; document.body.appendChild(s); }