ఢిల్లీ ఎన్నికలు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం..

Read Time:  1 min
Delhi Elections.. Polling percentage in the first hours
Delhi Elections.. Polling percentage in the first hours
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఈరోజు సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ ఉండనున్నాయి. ఇక, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి జై శంకర్‌ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

image

ఢిల్లీలో 1.56కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం 13,766 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు కేటాయించారు.. వృద్ధులు, వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్‌కు అవకాశం ఇవ్వగా.. 7980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలోనే తొలిసారిగా.. ఢిల్లీలో పోలింగ్ సెంటర్ల దగ్గర రద్దీని తెలుసుకునేందుకు వీలుగా క్యూ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (QMS) అప్లికేషన్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంఘం 3వేల పోలింగ్‌ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పింక్ కలర్ రంగుల్లో బూత్‌లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో బెలూన్ల తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూత్‌లు ‘మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం’ అంటూ స్పెషల్ థీమ్‌ను తీసుకొచ్చారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.