📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంత్రి పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున

Author Icon By sumalatha chinthakayala
Updated: October 7, 2024 • 9:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: త‌న కుటంబం వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు ఇవాళ విచారించింది. నాగ్ త‌ర‌ఫున ఆయ‌న న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు.

అనంత‌రం మంగ‌ళ‌వారం పిటిష‌న‌ర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. దీంతో రేపు ఆయ‌న కోర్టులో హాజ‌రుకానున్నారు. నాగ్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాల‌ను కూడా న‌మోదు చేయాల‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. త‌దుప‌రి విచార‌ణ‌ను న్యాయ‌స్థానం రేప‌టికి వాయిదా వేసింది.

ఇదిలాఉంటే.. స‌మంత‌-నాగ‌చైత‌న్య విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. మంత్రి వ్యాఖ్య‌లు త‌మ కుటుంబ ప‌రువుకు భంగం క‌లిగించాయ‌ని ఆమెపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాగార్జున నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త గురువారం మంత్రి సురేఖ‌పై ప‌రువున‌ష్టం దావా వేశారు.

Defamation suit KONDA SUREKHA nagarjuna akkineni

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.