📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Deepika Padukone : భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్గా దీపికా పదుకొణె

Author Icon By Sudheer
Updated: October 11, 2025 • 7:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) మరోసారి తన సామాజిక బాధ్యతతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమించింది. దీపికా ఈ బాధ్యత స్వీకరించడం తనకు గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డాతో సమావేశమై, మానసిక ఆరోగ్య ప్రోత్సాహ కార్యక్రమాలపై చర్చించారు. ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ, “ఇది నా జీవితంలోని అత్యంత గౌరవనీయమైన క్షణం. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం అంటే బలహీనత కాదు, అది బలానికి సంకేతం” అని పేర్కొన్నారు.

Latest News: Nobel Committee: ప్రచారాలు కాదు, చిత్తశుద్ధే ముఖ్యమన్న నోబెల్ కమిటీ

దీపికా పదుకొణె ఈ కొత్త బాధ్యతలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టెలీ మానస్ (Tele MANAS) వంటి పథకాల ప్రచారంలో భాగస్వామ్యం కానున్నారు. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉచిత మానసిక ఆరోగ్య సేవలు, కౌన్సిలింగ్ సదుపాయాలు అందుబాటులోకి రావడమే లక్ష్యం. దీపికా స్వయంగా గతంలో డిప్రెషన్ అనుభవించిన అనుభవాన్ని బహిర్గతం చేసి, మానసిక ఆరోగ్యంపై చర్చ ప్రారంభించిన తొలి భారతీయ సెలబ్రిటీల్లో ఒకరుగా నిలిచారు. అందుకే ఆమెను ఈ పాత్రకు సరైన వ్యక్తిగా ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం.

ప్రజలలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించడం, సహాయం కోరే వాతావరణాన్ని సృష్టించడం దీపికా ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ సంస్థలు, మరియు సామాజిక వేదికల ద్వారా ప్రజల్లో మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతే ముఖ్యం అనే సందేశాన్ని వ్యాప్తి చేయనున్నారు. ఈ ప్రయత్నం ద్వారా భారత్‌లో మానసిక ఆరోగ్య సంస్కృతి మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దీపికా పదుకొణె ఈ బాధ్యతను స్వీకరించడం ద్వారా కేవలం సినీ రంగానికే కాకుండా, సామాజిక మార్పు దిశగా కూడా ప్రేరణాత్మక అడుగు వేసినట్లైంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Deepika Padukone Google News in Telugu India's first Mental Health Ambassador Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.