📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dacoit teaser : ‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

Author Icon By Sai Kiran
Updated: December 19, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dacoit teaser : అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’ టీజర్ విడుదలైంది. శేష్‌తో పాటు మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. విజువల్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది.

షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

ఇప్పటి వరకూ స్టైలిష్, క్లాస్ యాక్షన్ పాత్రలతో కనిపించిన అడివి శేష్ ఈసారి పూర్తిగా మాస్ క్యారెక్టర్‌లో దర్శనమిచ్చాడు. టీజర్ అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్‌తో కట్ చేయగా, “ఇది ఒక ప్రేమకథ” అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టుగా ఓ వైలెంట్ లవ్ స్టోరీ ఉంటుందన్న హింట్ ఇచ్చారు.

Latest news: Mumbai Rent Crisis: ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

అక్కినేని నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’ సినిమాలోని (Dacoit teaser) సూపర్ హిట్ సాంగ్ ‘కన్నెపిట్టరో కన్ను కొట్టరో’ని రీమిక్స్ చేసి టీజర్‌లో వాడటం మరో హైలైట్. అనురాగ్ కశ్యప్ ఆ పాటను హమ్ చేయడం చూస్తే, సినిమా మొత్తం అక్కడక్కడా వినిపించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. భీమ్స్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

‘డెకాయిట్’ సినిమాను 2026 ఉగాది పండుగ సందర్భంగా, మార్చి 19న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఈ టీజర్ అడివి శేష్ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌లో కూడా గట్టి ఆసక్తిని క్రియేట్ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Adivi Sesh mass role Adivi Sesh new movie Anurag Kashyap role Bheems music Bilingual Telugu Hindi film Breaking News in Telugu Dacoit movie update Dacoit release date 2026 Dacoit teaser Dacoit teaser release Google News in Telugu Indian action love story Latest News in Telugu Mrunal Thakur Dacoit Prakash Raj Dacoit Sunil actor movie Telugu Cinema News Telugu movie teaser Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.