📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

D.CM Pawan: గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

Author Icon By Saritha
Updated: December 19, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉమ్మడి గోదావరి(Godavari) జిల్లాల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం కీలకంగా ముందుకు అడుగుపెడుతోంది. (D.CM Pawan) సుమారు రూ.3,050 కోట్లతో చేపట్టబోయే గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. పెరవలి వద్ద జాతీయ రహదారి 216ఏ సమీపంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాల్లోని సుమారు 67.82 లక్షల మందికి సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు. ఈ బృహత్తర పథకంలో ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలను సేకరించి, ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. తొలి దశలో రూ.1,650 కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 11 నియోజకవర్గాల్లో 39.64 లక్షల మందికి, రెండో దశలో రూ.1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో 28.18 లక్షల మందికి తాగునీటిని అందిస్తారు. జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read also: CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

ప్రజల కోసం శాశ్వత పరిష్కారం

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ,((D.CM Pawan)) భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా దీన్ని పరిష్కరిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నిర్మించి, పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికి శుద్ధమైన నీటిని సరఫరా చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలకాలని మంత్రి పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AndhraPradesh APDevelopment GodavariWaterGrid JalJeevanMission Latest News in Telugu PawanKalyan SafeDrinkingWater Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.