📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Crime: మీ కూతురితో పెళ్లి చేయకపోతే నగ్నఫోటోలు బయటపెడతా.. ఓ యువకుడి బ్లాక్ మెయిల్

Author Icon By Ramya
Updated: July 25, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime: ప్రేమంటే కొందరికి అదో సరదాసన్నివేశంగా భావిస్తున్నారు. తాను ప్రేమించిన యువతి తనకు దక్కాలి లేకపోతే హతమార్చాలి, లేదా ఆ అమ్మాయి క్యారెక్టర్ ను చెడ్డగా ప్రచారం చేయాలని ధోరణిలో కొందరుంటున్నారు. ఫలితంగా విషాదంగా తమ జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఇలాంటి విషాదకర సంఘట మెదక్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్ధుంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులను ఓ యువకుడు కోరాడు. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన యువకుడు మహ్మద్ సాబిల్ (Mohammed Sabil) (21) యువతి తల్లిదండ్రులను సాబిల్ పెళ్లిచేయమని కోరాడు. ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో కక్షపెంచుకున్న మహ్మద్ సాబిల్ యువతితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని వారి కుటుంబ సభ్యులను, యువతి అన్న సయ్యద్ అప్సర్ను సాబిల్ బెదిరించాడు.

ఫోటోలను డిలీట్ చేయలేదన్న కారణంగా యువకుడి హత్య – ప్రేమ వ్యవహారం తెచ్చిన విషాదాంతం

Crime: పథకం ప్రకారం యువకుడిని హతమార్చిన యువతి అన్న, స్నేహితుడు అయితే ఫోటోలను డిలీట్ చేయాలని సాబిల్ ను ఎన్నిసార్లు యువతి అన్న, మరో స్నేహితుడు కోరినా వినకపోవడంతో, మాట్లాడుకుందామని అతన్ని పిలిపించారు. వారు చెప్పిన చోటుకు సాబిల్ వచ్చాక, అతడిని కారులో ఎక్కించుకొని ముగ్దుంపూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లిన అప్సర్, సంతోస్లతో సాబిల్తో తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రేకులైన అప్సర్, సంతోష్ు సాబిల్ తలపై బండరాయితో కొట్టి చంపేసి, మృతదేహాన్ని అక్కడే పడేసి పరారయ్యారు. పోలీసులు అదుపులో నిందితులు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసును నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్సర్, సంతోష్ (Apsar, Santosh) ను అరెస్టు చేశారు. ప్రేమ రెండుకుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రేమించడం తప్పు కాదు కానీ ఆ ప్రేమకోసం ఉన్మాదంగా ప్రవర్తిస్తే చివరికి ఇలా విషాదంగా ముగిసిపోతాయి.

మహ్మద్ సాబిల్ ఎందుకు యువతి కుటుంబాన్ని బెదిరించాడు?

యువతిని ప్రేమించిన సాబిల్, పెళ్లికి నిరాకరించడంతో ఆమెతో ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరించాడు.

సాబిల్‌ను హత్య చేసిన వారు ఎవరు, ఎందుకు చేశారని పోలీసులు తెలిపారు?

యువతి అన్న సయ్యద్ అప్సర్, అతని స్నేహితుడు సంతోష్ సాబిల్‌ను హత్య చేశారు, ఎందుకంటే అతను ఫోటోలు డిలీట్ చేయడం లేదని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Urea: మంత్రుల ఇలాకాలో యూరియా కోసం రైతుల తిప్పలు

Breaking News latest news Love Tragedy medak Photo Threat Shivampet Telugu News Youth Murder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.