📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది : మంత్రి ఉత్తమ్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: February 28, 2025 • 7:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీజేపీ పాలనలో అన్ని విధాలుగా అణచివేత

హైదరాబాద్‌ : నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు జై భీమ్‌, జై బాపు, జై సంవిధాన్‌ కార్యక్రమం అవసరమని వివరించారు. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్‌ కుటుంబం కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలోనే ఈ ఏడాది ఎక్కువ ధాన్యం

బీజేపీ పాలనలో దేశంలో అన్ని విధాలుగా అణచివేత కొనసాగుతోందని ఆరోపించారు. ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని.. ప్రచారం చేయడంలో కొంత వెనుకబడిపోయామని తెలిపారు. దేశం మొత్తంలో తెలంగాణలోనే ఈ ఏడాది ఎక్కువ ధాన్యం పండించినట్లు పేర్కొన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని.. ఇవన్నీ జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవాలని వివరించారు.

ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకున్నాం.. మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. రైతులకు రుణమాఫీ చేశాం.. రైతు భరోసా చెల్లించాం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదిలోనే అనేక పనులు చేశామని.. అన్నీ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని.. దానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అంతకుముందు ఇంతకాలం తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షీకి ధన్యవాద తీర్మానం పెట్టారు.

Breaking News in Telugu congress party Google news Google News in Telugu Latest News in Telugu SC classification Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.