ఇటీవలి కాలంలో ఏసీ (AC Compressor ) కంప్రెషర్లు బాంబుల్లా పేలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ, మధురానగర్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న పేలుళ్లు ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. ప్రజలలో భయాందోళనలు నెలకొన్నాయి. గదిలో శీతల వాతావరణం కోసం వాడుతున్న ఏసీలు ప్రాణాంతకంగా మారుతుండటమే అందుకు కారణం. దీనికి సరైన నిర్వహణ లేకపోవడం, అప్రమత్తత కొరవడటమే ప్రధానమైన అంశాలుగా మారుతున్నాయి.
పేలుళ్లకు కారణమైన ప్రధాన అంశాలు
ఏసీ కంప్రెషర్ పేలుళ్ల(AC Compressor Blast)కు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాగా ఎండ తగిలే చోట కంప్రెషర్ ఉంచినపుడు, అధిక ఉష్ణోగ్రతలో కంప్రెషర్ పనిచేస్తే, అది వేడెక్కి పేలే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఏసీకి సర్వీసింగ్ చేయకపోవడం, లోపాలు గుర్తించకుండా ఉంచడం, గ్యాస్ లీకేజీని పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. అంతేగాక, ఓల్టేజ్లో వచ్చే హెచ్చుతగ్గులు, కూలింగ్ ఫ్యాన్ పనిచేయకపోవడం కూడా ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నాయి.
నిరోధక చర్యలు – అప్రమత్తతే ఆయుధం
ఏసీ వాడకం సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలు పాటించాలి. కంప్రెషర్‌ను ఎండ కంటే చల్లటి వాతావరణంలో ఉంచడం, తగిన సమయంలో సర్వీసింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. గ్యాస్ లీకేజీలను పరిగణలోకి తీసుకుని వెంటనే పరిష్కరించాలి. ఓల్టేజ్ స్టాబిలైజర్ వాడటం, కూలింగ్ ఫ్యాన్ సరిగా పనిచేస్తుందో లేదో చెక్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. సరైన అప్రమత్తతతో ప్రమాదాలను నివారించుకోవచ్చు.
Read Also : Kishan Reddy : కవిత వ్యవహారం ఫ్యామిలీ డ్రామా అన్న కిషన్ రెడ్డి