📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Latest news: Parthasarathi: కూటమి పాలనలో ప్రజల్లో సంతృప్తి

Author Icon By Saritha
Updated: October 23, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అభివృద్ధి, సంక్షేమంపై ఆనందోత్సాహాలు : మంత్రి పార్థసారథి

విజయవాడ : రాష్ట్రంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై రాష్ట్ర ప్రజల్లో 75 శాతం మందికి పైగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆర్టీజీఎస్(Parthasarathi) ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో వెల్లడైనట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నాడి, ప్రభుత్వ సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందు తున్న తీరుపై ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. మిగిలిన 25శాతం అసంతృప్తికి కారణాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నా మని, నూటికి నూరు శాతం కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఆర్టీజీఎస్ పనితీరుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) నిర్వహించిన సమీక్షలో ప్రజల సంతృప్త స్థాయి 75 శాతంకు పైగా ఉండటం తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారన్నారు. అయితే నూటికి నూరు శాతం సంతృప్త స్థాయి చేరేవరకు కృషి చేయాలని ఆయా శాఖాధిపతులను ఆదేశించారని మంత్రి తెలిపారు. ప్రజల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించడం జరిగిందన్నారు. మిగిలిన అసంతృప్తికి కారణాలు అధికారుల వైఫల్యమా, ప్రజాప్రతినిధుల వైపల్యమా తెలుసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారని మంత్రి పార్ధసారథి తెలిపారు. విద్యుత్ వినియోగంలో లోఓల్టేజీ, విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించా రన్నారు.

Read also: మరో 3 రోజులు భారీ వర్షాలు

Parthasarathi: కూటమి పాలనలో ప్రజల్లో సంతృప్తి

నూటికి నూరు శాతం సంతృప్తి లక్ష్యంగా సీఎం చంద్రబాబు

సబ్ స్టేషన్ ఒక యూనిట్గా తీసుకుని సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని, ప్రభుత్వం(Parthasarathi) ఏర్పడి కేవలం ఏడాదిన్నర కాలంలోనే దాదాపు రూ.7.65 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు రాష్ట్రానికి రావడం జరిగిందని, తద్వారా 182 ప్రాజక్టుల్లో 7.21 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఉచిత ఇసుక పాలసీ వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం రాకపోయినా త్యాగం చేసి మరీ ఉచిత ఇసుక అందిస్తున్నా మన్నారు. అలాగే హౌసింగ్లో ఏ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించిందని, హౌసింగ్ బిల్లులు త్వరలోనే చెల్లించనున్నామన్నారు. వాట్సప్ గవర్నెన్స్ లో భాగంగా 741 సర్వీస్లు అందుబాటులోకి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, కాని ప్రజలు ఆశించినంత స్థాయిలో సద్వినియోగం చేసుకోవ డం లేదని సీఎం చంద్రబాబు సమీక్షలో గుర్తించారన్నారు. ఈ సేవలను యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వర్షాకాలంలో పిడుగులు పడే ప్రాంతాలు, భారీ వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేసే మెసేజ్లు ప్రజలకు చేరవేయడంలో ముందున్నామన్నారు. తుఫాన్ ప్రభావంకు గురయ్యే ప్రాంతాలను సైతం ఖచ్చితత్వంతో కూడిన సమాచారం అందిస్తున్నామన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజలకు ఆ సేవలు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

డ్రోన్ పాలసీతో వ్యవసాయ రంగానికి ఊపిరి

డ్రోన్ పాలసీ రూపొందించిన తర్వాత రాష్ట్రంలో 2,10,047 గంటలకు పైగా డ్రోన్లను వినియోగించడం జరిగిందన్నారు. ప్రభుత్వ సేవలకు 64,759 గంటలు, ప్రైవేట్ గా 1,45,288 గంటలు వినియోగించడం జరిగిందన్నారు. అలాగే వంట పోలాలకు పురుగు మందులు పిచికారి చేయడానికి లక్షన్నర కు పైగా గంటలు వినియోగించినట్లు వివరించారు. డ్రోన్లు ద్వారా పురుగు మందులు పిచికారి చేయడం వలన ఎంత మేర ప్రయోజనం చేకూరిందన్న అంశంపై గణన జరుగుతుందన్నారు. డ్రోన్ల వినియోగం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూల్లో తయారైన డ్రోన్లు ఆపరేషన్ సిందూర్ వినియోగించామని, వాటి పనితీరు భేష్ అని సాక్షాత్తు ప్రధాని మోడీ మెచ్చుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తుచేశారు. పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ప్రజల నుంచి వస్తున్న విజుప్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్బన్ ప్రాంతాల్లో 50 వేల ఇళ్లను ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని, మరిన్ని దరఖాస్తులు వస్తే ఇంకా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గృహాలు లేనివారు నవంబర్ 5 లోపు అర్బన్ హౌసింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పార్థసారథి కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Chandrababu Naidu development Drone Policy Free Sand Policy Housing Latest News in Telugu Parthasarathi RTGS Survey Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.