📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా : సీఎం

Author Icon By sumalatha chinthakayala
Updated: March 8, 2025 • 9:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో ఇందిరమ్మ పాలన రావాలని మహిళలు కోరుకున్నారని.. వారి కోరిక తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో చంద్ర గ్రహణం తొలగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయించాం. ఆడ బిడ్డలు తలచుకుంటే వన్‌ ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదన్నారు.

కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలన మధ్య ఉన్న తేడా

జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించాం. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. పాఠశాలల నిర్వహణ, బడి పిల్లలకు కోటి 30లక్షల జతల యూనిఫామ్‌ కుట్టించే పని మహిళలకే అప్పగించాం. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చాం. ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులకు యజమానులు అవుతున్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సీతక్క, కొండా సురేఖ పనిచేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని సోనియాగాంధీ కృషి చేశారు. ఇందిరను అమ్మా అన్నారు.. ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు.. నన్ను రేవంతన్న అంటున్నారు. మీతో పేగుబంధం కలిగిన మీ అన్నగా మాట ఇస్తున్నా.. మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తా అని సీఎం అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలన మధ్య ఉన్న తేడాను మహిళలు గమనిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు మహిళలను అన్ని రంగాల్లో విస్మరించిందని.. కేసీఆర్ మొదటి టర్మ్‎లో ఆయన కేబినెట్‎లో ఒక్క మహిళా కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శమని సీఎం విమర్శించారు.

Breaking News in Telugu CM Revanth Reddy Google news Google News in Telugu International Womens Day Latest News in Telugu Mahila Shakti Sabha Secunderabad Parade Ground Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.