📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన సీఎం..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 4, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ 61,84,319 మంది (17.43శాతం) ఉన్నారని తెలిపారు. బీసీలు (ముస్లిం మైనారిటీలు మినహా) 46.25శాతంగా ఉన్నారని.. బీసీల జనాభా 1,64,09,179గా ఉందని పేర్కొన్నారు. ఎస్టీలు 37,05,929 మంది (10.45శాతంగా) ఉన్నారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు 44,57,012 మంది (12.56శాతంగా) ఉన్నారని చెప్పారు. ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588 (10శాతం)గా ఉన్నారని పేర్కొన్నారు.

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కుల సర్వే నివేదికను సభలో ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర ఇంటింటి కుల సర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో నిర్ణయించామని.. కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 మంది (2.48శాతంగా) ఉన్నారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ఓసీలు 56,01,539 (15.79శాతంగా) మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు మినహా ఓసీలు 47,21,115 మంది (13.31శాతం) ఉన్నారని రేవంత్‌ చెప్పారు. కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామన్నారు.

దాదాపు 50 రోజులపాటు సర్వే జరిగిందన్నారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని చెప్పారు. పట్టణాల్లో 45.15లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 1.12కోట్ల కుటుంబాల సర్వే జరిగిందన్నారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్‌ అతికించారన్నారు. ఒక ఎన్యుమరేటర్‌ రోజుకు పది ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని.. ఎనిమిది పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు. 76వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు డేటా క్రోడీకరించి.. రూ.125కోట్లు ఖర్చు చేసి సమగ్ర వివరాలు సేకరించినట్లు వివరించారు. నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే సర్వే చేసినట్లు స్పష్టం చేశారు.

Cast Census Report CM Revanth Reddy congress Google news Telangana assembly

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.