చిన్న ఆలోచనలే కొన్నిసార్లు పెద్ద మార్పులకు దారితీస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిగత (Cm Chandrababu) పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం(Government) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ముస్తాబు’ కార్యక్రమం అలాంటి సానుకూల మార్పుకు బాట వేస్తుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘ముస్తాబు కార్నర్’ను పరిశీలించిన ఆయన, విద్యార్థినులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమం నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు అవుతుందని సీఎం ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక అధికారి చొరవతో మొదలైన మంచి ప్రయత్నాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని చెప్పారు.
Read also: AP Politics: సోషల్ మీడియాలో రాజకీయ యుద్ధం.. పవన్ వ్యాఖ్యలకు అంబటి ఘాటు కౌంటర్

రాష్ట్రవ్యాప్తంగా అమలు, విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి
పాఠశాలకు శుభ్రంగా రావడం, యూనిఫాం సక్రమంగా ధరించడం, తల దువ్వుకోవడం, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చదువుపై శ్రద్ధను పెంచుతాయని వివరించారు. (Cm Chandrababu) ‘ముస్తాబు’ కోసం అదనపు ఖర్చు అవసరం లేదని, ఈ అలవాట్లు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందిస్తాయని అన్నారు.

రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన సీఎం, అమ్మకు వందనం, నాణ్యమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, పౌష్టికాహారంతో కూడిన భోజనం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యారంగంలో వినూత్న సంస్కరణలు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: