📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: :CM Chandrababu: అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు

Author Icon By Saritha
Updated: November 26, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి విద్యార్థి బ్లడ్ శాంపిల్స్, హాస్టళ్లలో వాటర్ శాంపిల్స్ తీసుకోండి

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలు కునిక్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. (CM Chandrababu) ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షి యల్ స్కూళ్లల్లోని మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షి౦చారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లా డుతూ సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధం నూటికి నూరు శాతం నిర్వహించాలి. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదన్నారు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదు. అలాంటివి పునరావ ృతమైతే… ఏం జరిగిందని తెలుసుకునేది ఉండదన్నారు.. నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 20 శాతం హాస్టళ్లల్లో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరపాల్సి ఉంది. ఈ టాయిలెట్ల నిర్మాణం కోసం అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేస్తాం. టాయిలెట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గత నిరక్ష ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండడం సరి కాదు. ఆర్వో ప్లాంట్లు లేని ప్రతి హాస్టల్లోనూ… ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ(Schools) ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.

Read also: కంగుతిన్న కర్రెగుట్టలు! మకాం వేసిన 10 వేల మంది భద్రతా బలగాలు

CM Chandrababu: RO plants in all welfare hostels

హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు చర్యలు

డాక్టర్లతో విద్యార్థులకు రెగ్యులర్ (CM Chandrababu) హెల్త్ చెకప్స్, చేయించాలి. హాస్టళ్లలోని 4.17 లక్షల మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి సమస్యలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్సలు అందించాలి. బడుగు విద్యార్థులకు చేసే సాయాన్ని బాధ్యతగా తీసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో హాస్టళ్లు పెట్టారు. దీనికి విఘాతం కల్గించేలా అలక్ష ్యం చేస్తే ఊరుకునేదే లేదు. హాస్టళ్లల్లో పరిస్థితి పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనల చేపట్టడంతో పాటు పరిస్థితులపై నిత్యం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలి. సంక్షేమ రంగానికి చెందిన శాఖలన్నీ కలిపి ఉమ్మడిగా ఓ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని హాస్టళ్లల్లోని విద్యార్థులకు డిజిటల్ హెల్త్ రికార్న్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వైద్య పరీక్షలు నిర్వహించే సందర్భంగా విద్యార్థు ల్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే… ఆ అనారోగ్య సమస్యలకు గల మూలాలను విశ్లేషించాలి. దానికి అనుగుణంగా వైద్యం అందేలా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా ప్రత్యేక కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ ఇప్పించండి. బాలుర హాస్టళ్లల్లోని వారికి మగ కౌన్సిలర్ల ద్వారా… బాలికల హాస్టళ్లోని వారికి మహిళా కౌన్సిలర్లతో కౌన్సి లింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

ARVO plants blood samples CM chandrababu Latest News in Telugu Residential Schools SC ST BC hostels Student Health Checkups water samples welfare hostels

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.