📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Telugu News:Floods-నెల్లూరు వరదల్లో కొట్టుకుపోయిన చిన్నారి.. పలువురి మృతి

Author Icon By Pooja
Updated: September 20, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వద్దంటే వర్షాలు, పొమ్మాన్నా పోని వరదలు. వెరసీ పరేషాన్ అవుతున్నారు జనాలు. ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు ఇంచుమించు ప్రతిరోజూ వర్షాలే కురుస్తున్నాయి. పగలేమో ఎండలు కాస్తున్నాయి, సాయంత్రం కాగానే విపరీతమైన వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షాలకు(heavy rains) జిల్లా అతలాకుతలం చేశాయి. శుక్రావారం రాత్రి కురిసిన కుంభవృష్టితో రాయబోటిలో విషాదం నెలకొంది. పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తింది. ఈ వర్షపునీటిలో నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా ఒక చిన్నారి ఆచూకీ లభించలేదు. భారీ వర్షం కారణంగా రాయచోటిలోని మురుగు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక డ్రైనేజి కాలువలో ఓ మహిళ, బాలిక పడి కొట్టుకుపోయారు. ఎస్ఎన్ కాలనీ వెనుక భాగాన ఉన్న కాలువలో ఒక వృద్ధురాలి(60), ఆమె కుటుంబానికి చెందిన చిన్నారి (5) నీళ్లల్లో పడిపోయారు.

వారు కొట్టుకు పోతుండడాన్ని గమనిస్తించిన స్థానిక యువకుడు గంగయ్య కూడా వారితో పాటే కొట్టుకుపోయాడు. వవెంటనే అప్రమత్తమైన స్థానికులు గాలించి అక్కడికి సమీపంలోని గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న కల్వర్టు నుంచి ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు కె. రామాపురం సమీపంలో ఉన్న 4 కుళాయిల వద్ద నీటి ప్రవాహంలో యామిని (7) అనే బాలిక కొట్టుకు పోయింది. ఆమె ఆచూకీ లభించలేదు.

పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు

గడచిన 24గంటలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం(Waterlogging) అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాయచోటిలో స్కూలు విద్యార్థులతో వెళ్తున్న ఆటో వరద ప్రవాహంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు అప్రమత్తమై వారికి కాపాడారు. అయితే ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయింది. బాలిక మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బందికి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నిత్యం వర్షంతో ప్రజాజీవనం అస్తవ్యస్థం

గత రెండు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీత వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టితో నదులు, వాగులు వరదనీటితో మునిగిపోయాయి. దీంతో కాలనీలో వరదనీటితో ముంచెత్తుతున్నాయి. ఇండ్లలోకి నీరు రావడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికి తోడు అంటువ్యాధులు ప్రబలి పలువురు అనారోగ్యాలకు గురవుతున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. వద్దంటే వర్షాలతో తమ ఇళ్లలోకి నీరు చేరడంతో సరులతో పాటు, గృహవస్తువులు సైతం పాడైపోయినట్లు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంటపొలాలు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు, పేదలు కోరుతున్నారు.

ప్రభుత్వ ప్రతిస్పందన ఏమిటి?
సహాయక బృందాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది శోధన, రక్షణ చర్యలు చేపట్టాయి.

వరదల కారణం ఏమిటి?
కురిసిన భారీ వర్షాల వల్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రమాదాలు జరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/the-estimated-cost-of-rs-35-thousand-crores-is-a-complete-lie/telangana/550766/

Breaking News in Telugu ChildDrowned deaths DisasterManagement Floods Google News in Telugu HeavyRains Latest News in Telugu Nellore Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.