Latest News: Chevella Accident: చేవెళ్ల ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Read Time:  1 min
 Chevella Accident
 Chevella Accident
FONT SIZE
GET APP

రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా మీర్జాగూడ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారేనని అధికారిక సమాచారం వెలువడింది.

నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది స్వగ్రామాలకు వెళ్లి, ఈ రోజు ఉదయం హైదరాబాద్ (Hyderabad) తిరిగి వస్తుండగా ఈ దారుణం సంభవించింది. కంకర లారీ బస్సుని, ఎదురుగా ఢీకొట్టడంతో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

Read Also: Chevella Road Accident: మాటకందని వేదన.. వైరల్‌ అవుతున్న వీడియోలు

మరణించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు, కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. ఉదయం సమయంలో ప్రమాదం జరగడం వల్ల, చాలామంది ఆఫీసులకు చేరుకునేందుకు బస్సులో ప్రయాణం చేస్తున్నారు.

 Chevella Accident
 Chevella Accident

ఒక్కసారిగా జరిగిన ఢీతో బస్సు నుజ్జు నుజ్జు కావడంతో ఎవరికీ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ నం: 9912919545, 9440854433.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.