మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం డ్యూయల్ ఫోకస్‌తో తన కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ‘గేమ్ ఛేంజర్’ ఫలితం నిరాశపరిచినప్పటికీ, ‘పెద్ది’లో చరణ్ పోషిస్తున్న ఆట కూలీ పాత్ర, ఏఆర్ రెహమాన్ అందించిన సెన్సేషనల్ హిట్ ‘చికిరి చికిరి’ సాంగ్ సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్స్‌లో శరవేగంగా జరుగుతోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యం కారణంగా మే లేదా దసరా సీజన్‌కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు
మరోవైపు, టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ చరణ్ – సుకుమార్ మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్ కావడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. సుకుమార్ ఈ సినిమా కోసం రెండు భిన్నమైన కథలను (ఒకటి క్లాస్, మరొకటి ఊరమాస్) సిద్ధం చేయగా, రామ్‌చరణ్ మాత్రం ప్రేక్షకుల పల్స్ తెలిసిన తన ఫేవరెట్ ‘ఊరమాస్’ కథకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సుకుమార్ మార్క్ మేకింగ్‌తో, రామ్‌చరణ్‌ను మరోసారి సరికొత్త రస్టిక్ లుక్‌లో చూసేందుకు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘పుష్ప 2’తో రూ.1800 కోట్ల వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిని శాసించిన సుకుమార్‌కు ఈ సినిమా ఒక సవాల్‌గా మారింది. చరణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ స్క్రిప్ట్‌ను ఆయన డిజైన్ చేస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు ‘పెద్ది’తో క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌ని టచ్ చేస్తూనే, సుకుమార్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన బాక్సాఫీస్ సత్తా చాటాలని చరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com